The Friendly Tortoise and Happy Bear Story: Telugu Stories For Kids
Telugu Stories
అనగనగా ఒక అడవిలో బీరకాయ అనే ఎలుగు బంటి ఉంది. అదే అడవిలో తాతి అనే తాబేలు కూడా ఉండేది.
బీరకాయ ఎప్పుడు అలసత్వంతో, బాధగా జీవించేది. కనీ తాతి తాబేలు మాత్రం ఎంతో చాలకీగా, చురుకుగా ఉంటూ అందరికే సాయం చేస్తుూ మంచి మిత్రుడిగా ఉంది.
ఒకసారి అడవిలో తుఫాను తాకిడికి చెట్లన్నీ చెల్లా చెదరుగా విరిగిపోయాయి.
అడవిలోని జంతువులన్నీ తమ ఇళ్ళన్నీ మళ్ళీ కట్టుకున్నాయి. బీరకాయ ఎలుగు బంటి ఎంతో కష్టపడి తన ఇంటిని కట్టుకోసాగింది.
బీరకాయ ఎలుగు బంటి సరిగ్గా ఇల్లు కట్టకపోవటం వల్ల బీరకాయ ఎలుగు బంటి యొక్క ఇల్లు మళ్ళీ మళ్ళీ పడిపోయింది.
అప్పుడు తన ఇల్లు పూర్తిగా కట్టుకున్న తాటి తాబేలు బీరకాయకి సహాయం చెయ్యటానికి వెళ్ళింది.
ఇది చూసి మిగిలిన జంతువులు, అంటే, జింక, నెమలి, ఏనుగు, ఇంకా మిగిలిన జంతువులు అన్నీ కూడా బీరకాయ ఎలుగు బంటికి సాయం చేయటానికి వచ్చాయి.
ఇది చూసిన బీరకాయ ఎలుగుబంటి ఎంతో ఉత్సాహంతో తన ఇంటిని గట్టిగా మంచిగా కట్టుకుంది.
అప్పటినుంచి బీరకాయ ఎలుగుబంటి ఎప్పుడుకూడా అందరికి సాయం చేస్తూ, ఉత్సాహంగా, చాలకీగా, చురుకుగా, అలసత్వాన్ని పూర్తిగా వదిలి మంచిగా జీవించింది.
దీని వల్ల అర్థం చేసుకోవాల్సింది ఎమిటంటే ఎప్పుడు చురుకుగా ఉండటం అనేది అన్ని విధాల ఆరోగ్యకరము.
కాబట్టి పిల్లలూ మీరు ఎప్పుడూ చలాకీగా! చురుకుగా! ఉండాలి.
Grandma telugu stories will bring you more telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading telugu stories...🎉🎉☕☕✨😀