Must Read Telugu Stories Sri Rama
శ్రీ రాముని భూతదయ
శ్రీ రాముడు, లక్ష్మణుడు, సీతాన్వేషణలో పల్లెలు, నదులు, పర్వతాలను, దాటుకుంటూ ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఒకరోజు సాయంకాలం అయ్యింది. క్షత్రియులు సాయంకాలం తప్పకుండా సూర్య ప్రార్థన చెయ్యాలి.
రాముడు, లక్ష్మణుడు ఒక నది ఒడ్డుకి చేరుకున్నారు. రాముడు ఒక బాణాన్ని నేల మీద నాటి దాని మీద తన తువ్వాలు ఉంచి నదిలోకి దిగి సూర్యోపాసన చేసి తిరిగి గట్టు మీదకి చేరుకున్నాడు.
తన తువ్వాలుతో ఒళ్ళు తుడుచుకున్నాడు. నేలమీద నాటిన తన బాణాన్ని పైకి తీసాడు.
బాణపు అంచుకి రక్తం అంటుకుని ఉంది.
రాముడు ఆశ్చర్యపడి అక్కడి మట్టిని కొంత తొలిగించి
చూశాడు.
అక్కడ మూలుగుతూ ఓక కప్ప ఉంది. ఆ కప్ప మానవ భాషలో "రామ!! నాకు ఏ కష్టం వచ్చిన రామ, రామ అనుకుంటాను. అలాంటిది నీవే బాణం గుచ్చితే నేను ఎవరికి మోర పెట్టుకొను." అని బాధగా అనింది.
రాముడు చాలా బాధపడి ఆ కప్పను తనచేతిలోకి తీసుకుని తన చేతి వేళ్ళతో నిమిరాడు.
వెంటనే కప్పకి బాధలన్నీ తగ్గిపోయాయి కానీ రెండు మచ్చలు మాత్రం ఉండిపోయాయి. ఆవే ఇప్పటికి కప్ప మీద కనిపించే మచ్చలు.
ఈ విషయం ద్వారా రాముడు ఎంత భూత దయ కలిగినవాడో మనకి అర్థం అవుతుంది.
Must Read Telugu Stories Sri Rama, and for many more ......
Grandmas stories will bring you more telugu stories, language resources, and many more
Keep reading Grandmas stories
Tags:
Devotional Stories