Grandma Telugu Stories Brings You Telugu Stories
Telugu Stories
The Realization
రేణిగుంటకి దగ్గర వ్యాస ఆశ్రమం ఉంది. అక్కడ దైవిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. వ్యాస ఆశ్రమానికి సంబంధించిన స్వాములవారు తన శిష్యులతో సహా దగ్గరలో ఉన్న శివాలయానికి వచ్చారు. అక్కడ పూజా కార్యక్రమం పూర్తైన తరువాత గుడిలోనే కూర్చుని ఉన్నారు.
ఇంతలో ఒక భక్తుడు గుడి సింహ ద్వారం దగ్గర సాష్టాంగ పడి నమస్కారం చేశాడు.
అతనికి చిన్న దెబ్బ తగిలింది. అతని పక్కనే నిలబడి ఉన్న మరొక వ్యక్తి దైవ దూషణ చేస్తున్నాడు.
దైవాన్ని దూషించే వ్యక్తికి ఒక రూపాయి నోటు
దొరికింది.
వ్యాస ఆశ్రమం శిష్యులు ఈ రెండు సంఘటనలు గమనించి చాలా ఆశ్చర్యపడి గురువుగారితో స్వామి భగవంతుడిని మొక్కిన వాడికి దెబ్బ తగిలింది.
కానీ దైవ దూషణ చేసిన వ్యక్తికి రూపాయి నోటు దొరికింది.
కలి కాల ప్రభావమా అని గురువుగారిని ప్రశ్నించారు.
దానికి గురువుగారు ఒక నిమిషం కళ్ళు మూసుకుని ఆ రెండు సంఘటనలలో ఉన్నటువంటి వాస్తవాలను గుర్తించి తన శిష్యులతో ఇలా అన్నారు, "శిష్యులారా!! ఈ రెండు సంఘటనలలో మీరు నేర్చుకోవలసింది చాలా ఉంది.
నిజానికి దేవుడికి దణ్ణం పెట్టుకున్న భక్తునికి ఆ సమయంలో మృత్యు యోగం ఉంది. కానీ అతడు దైవ ధ్యానంలో ఉన్నందువల్ల చిన్న దెబ్బతో దేవుడు అతన్ని కాపాడాడు.
ఇక దైవ దూషణ వ్యక్తి విషయానికి వస్తే అతనికి ఆ సమయంలో లక్ష రూపాయలు పొందే యోగం ఉంది, దైవ దూషణ అనే పాపం చేసినందువల్ల కేవలం ఒక రూపాయి పొందేదానికి ఆ యోగం దిగజారిపోయింది.
Tags:
Devotional Stories