Telugu Stories From Telugu Proverbs
Grandma Telugu Stories Brings You Telugu Stories
అంతా మన మంచికే
పూర్వం సింధూరాజ్యాన్ని రవి వర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతని దగ్గర చాలా తెలివైన ప్రధాన మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి అన్ని విషయాలకు అంతా మన మంచికే అనేవాడు.
ఒక రోజున రవి వర్మ ఒక్కడే వేటకు వెళ్ళాడు జంతువులని వేటాడే నేపథ్యంలో అతని చేతి వేలు తెగిపోయింది. రవి వర్మ తిరిగి కోటకు చేరుకున్నాడు. రవి వర్మ జరిగిన విషయం మంత్రికి చెపాడు.
మంత్రి తన సహజ ధోరణిలో "అంతా మన మంచికే" అన్నాడు.
ఇది విన్న రవి వర్మకు తన వేలు తెగిపోతే మంచిదంటాడేంటి ఈ పిచ్చి మంత్రి, అని అనుకుని ఆ మంత్రిని వెంటనే జైలులో పెట్టించాడు.
కొంత కాలం తరువాత రవివర్మ మళ్ళీ అడవికి వేటకి వెళ్ళాడు. ఆటవికులు రాజుని పట్టుకున్నారు.
రాజుని వాళ్ళ దేవతకి బాలి ఇస్తే ఆటవికులకి మంచిదని అనుకునేవారు. అమ్మవారి దగ్గర పూజని మొదలుపెట్టారు ఆటవికులు సరిగ్గా బలి ఇచ్చే సమయానికి రవి వర్మ చేతికి ఒక వేలు లేకపోవటం గమనించారు.
వాళ్ళ పురోహితుడు అంగవైకల్యం ఉన్నవారిని వాళ్ళ దేవతకి బలి ఇవ్వకూడదని చెప్తాడు.
వెంటనే వాళ్ళు రాజుని వదిలేశారు.
రవి వర్మ తన అంతఃపురానికి చేరుకున్నాడు. మంత్రి అంతా మన మంచికే అని ఎందుకు అన్నాడో అతనికి అర్థమయ్యింది.
మంత్రిని విడుదల చేసి అతనికి క్షమాపణలు చెప్పి తిరిగి మంత్రిగా చేర్చుకున్నాడు.
అందుకే అన్నారు పెద్దలు,"అంతా మన మంచికే" అని.
అంటే ఏ విషయంలోనైనా మనం ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి అని ఈ విధంగా చెప్పారు.
Must Read Telugu Stories Sri Rama, lord Shiva, kings and kingdoms and for many more ......
Grandma telugu stories will bring you more telugu stories, language resources, and many more
Keep reading telugu stories
Grandma telugu stories will bring you more telugu stories, language resources, and many more
Keep reading telugu stories