How Did The King Found the Traitor: Tale Of The King Of Vijayapuri
విజయపురి మహారాజు వినయ వర్మ తన రాజ్యాన్ని, ప్రజలని చక్కగా పరిపాలించేవాడు. విజయపురి శాంతి సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి పేరుపొందింది. విజయపురితో పక్క రాజ్యాలకి ఏంతో సఖ్యత ఉండేది.
ఇలా ఉండగా గుప్తచారుల ద్వారా ఒక విషయం వినయ వర్మకి తెలిసింది. అదేమిటంటే వినయ వర్మ మీద ప్రోగు రాజ్యాలలోని అవంతీ రాజ్యం రాజు విషం పెట్టి వినయ వర్మని చంపాలని పథకం వేసాడని.
అవంతీ రాజు యొక్క కుట్ర తెలిసింది కానీ ఎలా చేయబోతున్నాడో, ఎవరి ద్వారా ఈ పని చేయిస్తాడు అని మాత్రం తెలియదు.
విషయం తెలుసుకుంటానికి తన వేగులని వినయ వర్మ అప్రమత్తంగా ఉండమంటాడు.
ఇలా ఉండగా ఒక రోజు వినయ వర్మ తన ఉద్యాన వనంలో తిరుగుతూ పాయసం తాగబోతుండగా ఒక హంస ఎగురుతూ రావటంతో తాగుతున్న పాయసాన్ని అక్కడ పెట్టి హంస దగ్గరికి వెళ్తాడు.
ఆ హంస కొంతసేపటికి పాయసం పాత్ర దగ్గరికి వచ్చి కొంత పాయసాన్ని తాగుతుంది. కొంత సేపటికి ఆ హంస చనిపోయింది. అది చనిపోయిన తరువాత దాని శరీరం నీలం రంగులోకి మారుతుంది. దానితో వినయ వర్మ ఎంతో బాధపడి, తన మీద ఈ హత్యా యత్నం ఎవరు చేసారు అని ఆలోచించటం మొదలుపెడతాడు.
మొదట అనుమానం వంటవాడి మీదకి వెళుతుంది. కానీ వంటవాడు ఎంతో చిన్న రాజోద్యోగి వాడు కనుక ఈ పని చేస్తే వెంటనే అనుమానం వాడి మీదకే వెళుతుందని వాడు ఆ రాజ్యంనుంచి పారిపోయావాడు కానీ వాడు ఎక్కడికీ వెళ్ళలేదు.
దానితో రాజు వినయ వర్మ ఈ పని చేసింది వంటవాడు కాదు ఇంకెవరో అని నిర్ధారణకు వస్తాడు.
ఈ పని చేసిన వాడిని పట్టుకోవటానికి ఒక పథకం వేస్తాడు రాజు వినయ వర్మ.
విష ప్రయోగంజరిగిన కొన్ని రోజులకి రాజు వినయ వర్మ రాజ్యమంతా ఒక చాటింపు వేయిస్తాడు.
అది ఏమిటంటే "సరిగ్గా వరం తరువాత రాజ భవనంలో ఒక వంటల పోటీ జరగబోతోంది, రాజ్యంలో నల భీమ పాకం వండగలిగినవారు పోటీలో పాల్గొని రాజు ఇచ్చే పెద్ద సొమ్మును గెలుపొందవచ్చు. ఇంకా అసలు గొప్ప విషయం ఏమిటంటే వండిన వంటలని రాజు వినయ వర్మ తానే స్వయంగా రుచి చూసి విజేతని ప్రకటిస్తాడు అని చాటింపు వేయించాడు.
ఇది విని ప్రజలందరూ వారిలో ఎవరు రుచిగా వండగలరో వారంతా ఆ వంటల పోటీలో పాల్గొనటానికి సన్నాహాలు మొదలుపెట్టారు.
వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. వంటల పోటీ జరిగే రోజు రానే వచ్చింది, పోటీ మొదలైంది.
అందరు ఎంతో రుచికరమైన వంటలు వండుతున్నారు. అక్కడి నుంచి ఊరి చివరిదాకా మంచి వాసనలు వస్తున్నాయి.
పోటీ సమయం ముగిసింది.
అందరు ఎన్నో కొత్త కొత్త వంటలు, ఆ రాజ్యంలో పేరుగొన్న వంటలూ చేశారు. ఎన్నో రకాల పిండి వంటలు పాత్రల నిండా వండి ఉన్నాయి.
వారిలో చివరకి నలుగురు వంటగాళ్లు చివరి ఘట్టానికి చేరుకున్నారు.
వారందరూ రాజుకి ఏంతో ఇష్టమైన పాయసం వండాలని చెప్పారు. ఆ నలుగురూ అలాగే పాయసాన్ని వండి రాజు వినయ వర్మ ముందు పెట్టారు.
ఇంక రాజు వినయ వర్మ రుచి చూసి విజేతని ప్రకటించటం మాత్రమే మిగిలి ఉన్నది
మంత్రి మార్జాలుడికి కూడా ఈ వంటల పోటీకి హత్యాయత్నం చేసినవాణ్ణి బయటపెట్టాడు ఉన్న సంబంధం అర్థం కాలేదు.
అప్పుడు అందరూ విజేత ఎవరా ఆసక్తిగా గమనిస్తుండగా రాజు లేచి ఆ నలుగురి దగ్గరకు వచ్చి మీరు చేసిన పాయసం పత్రాలు పట్టుకుని మీరు తినండి అన్నాడు.
అప్పుడు ఆ నలుగురిలో ముగ్గురు వెంటనే వారి పత్రాలు పట్టుకుని వారు చేసిన పాయసాన్ని తినటం మొదలు పెట్టారు.
ఆ నాలుగోవాడిని రాజు వినయవర్మ నువ్వు ఎందుకు నీవు చేసిన పాయసాన్ని తినటం లేదు అని అడిగాడు.
అప్పుడు ఆ నాలుగోవాడు తనకి వైద్యుడు తీపి తినవద్దని చెప్పాడని చెబుతాడు.
అప్పుడు రాజు వినయ వర్మ ఆ నాలుగోవాడు చేసిన పాయసాన్ని పక్కనే ఉన్న పిల్లికి తినిపించమని చెబుతాడు.
వెంటనే తన బండారం బయటపడిందని అక్కడి నుంచి జారుకోవటం మంచిదని ఆ నాలుగోవాడు పారిపోబోయాడు. కానీ అక్కడే ఉన్న రాజ భటులు ఆ నాలుగోవాడిని పట్టుకుని తీసుకువెళ్లి చెరసాలలో వేస్తారు.
ఇంకే ముంది వాడు చెప్పిన విషయాన్ని పొరుగు రాజ్యలందరి ముందు పెడతాడు రాజు వినయ వర్మ దానితో అవంతీ రాజ్య రాజు యొక్క కుటిల బుద్ధి అందరి ముందు బయటపడింది. ఇంకేముంది అందరు రాజులూ అవంతీ రాజ్య రాజుకి మరణ దండన విధించాల్సిందని నిర్ణయిస్తారు.
పాము చావకుండా కర్ర విరగకుండా తెలివిగా ప్రవర్తించిన రాజు వినయ వర్మని అందరూ అభినందించారు.
అందుకే అన్నారు పెద్దలు " పాము చావకుండా కర్ర విరగకుండా " అని
అంటే పై కథలో చెప్పినట్టుగా రాజు వినయ వర్మ తన మీద హత్యా యత్నం చేసిన అవంతీ రాజుని తన తెలివితేటలతో బయట పెట్టి శిక్ష పడేలా చేశాడు . అంతే కానీ వెంటనే యుద్ధం ప్రకటించి జన నష్టం, ప్రాణ నష్టం చేయలేదు
Tags:
King Stories