What is Empathy? Tale Of The Lion And An Elephant

What is Empathy? Tale Of The Lion And An Elephant

అనగనగా సింహపురి అనే ఒక అడవి ఉంది. ఆ అడవికి రాజు ఒక ధైర్యవంతమైన సింహం. ఆ సింహం ఎంతో ధైర్యంగా ఉండేది. అలాంటి ఆ సింహానికి నదురు బెదురు లేదు కానీ దానికి ఒకే ఒక ఒక్క విషయం అంటే భయం ఉండేది, ఆశ్చర్యకరంగా అదేమిటంటే ఆ సింహానికి కోడి అరుపు విన్నప్పుడు భయం వేసేది. ఆ సింహం కోడి అరుపుకు తప్ప ప్రపంచంలో దేనికి భయపడేది కాదు.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu prover

సరే అని, సింహం తన భయాన్ని ఎవరికైనా చెప్పుకుంటే పోతుందేమోనని ఒకరోజు ఏనుగుకి తన భయాన్ని చెప్పుకుంది. ఏనుగుతో సింహం ఇలా చెప్పసాగింది ఓ మిత్రమా నాకు కోడి అరుపు తప్ప ఈ ప్రపంచంలో భయం కలిగించేది ఏదీ లేదు సాటి సింహాన్ని చూసినా వెరవని నాకు, ఒక కోడి అరుపు వింటే మాత్రం వెన్నులో చలి పుడుతుంది, నీకేమన్నా చెప్పుకుంటే నువ్వేమైనా సాయం చేయగలవు ఏమోనని నీకు చెప్తున్నాను, అని అంది సింహం.

"ఓ సింహమా! ఓ మృగరాజ! అడవికి రాజు నువ్వు, ప్రపంచంలో దేనికి భయపడవు నదురు బెదురు లేని మృగరాజు అటువంటి నీకు కోడిపుంజు అరుపు వింటే ఎలా భయం వస్తుంది, దానికి ఎందుకు భయపడుతున్నావు, నీ మనసులో నుంచి ఆ భయాన్ని తీసేయ్యి," అని చెప్పింది ఏనుగు. 😀

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu prover


ఇంతలో ఒక దోమ ఏనుగు చెవి చుట్టూ ఆడడం మొదలు పెట్టింది అంత పెద్ద ఏనుగు దాన్ని చూసి భయపడటం మొదలుపెట్టింది. అప్పుడు సింహం, "ఓ ఏనుగా ఓ మిత్రమా దోమ శబ్దం విని దోమని చూసి ఎందుకు భయపడుతున్నావు," అని అడిగింది.

అప్పుడు ఆ ఏనుగు "ఆ దోమ నా చెవిలోకి వెళితే, అయ్య బాబోయ్! నా ప్రాణాలు పోతాయేమో" అని అంది. ఇప్పుడు ఏనుగు మాటలు విన్న సింహం ఇంత పెద్ద ఏనుగై ఉండి అంత చిన్న దోమకు భయపడుతున్నందుకు భళ్లున నవ్వింది సింహం. 😀
Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu prover

ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే సానుభూతి చూపించడం సలహా ఇవ్వడం చాలా తేలిక కానీ ఆ సలహాని ఆచరించటం కష్టం. ఎవరికైనా మనం సలహా ఇచ్చేముందు మనం దాన్ని ఆచరిస్తున్నామా లేదా అన్నది ఆలోచించుకోవడం ఎంతో ముఖ్యం. ఈ కథలో సింహం తన భయం చెప్పుకున్నప్పుడు, ఏనుగు విని నవ్వేసి ఒక సలహా ఇచ్చింది కానీ ఇంతలో ఏనుగు కూడా అలాగే చిన్న జీవిని చూసి భయపడింది దాంతో సింహం కూడా ఏనుగుని చూసి నవ్వేసింది అందువలన సలహా ఇవ్వటం కన్నా పాటించటం ముఖ్యమైందని తెలుసుకోవాలి.



Grandma telugu stories will bring you more telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading telugu stories...🎉🎉☕☕✨😀

Grandma

I am a housewife with three kids they encouraged me to take blogging so that I can show my superpower ✨✨🎉🎉✨✨☕☕ of telling stories to all, sharing my cooking recipes..... many more interesting things....

Post a Comment

Previous Post Next Post