All Good Deeds Are Rewarded: The Tale Of Vikrama And The Princess
అనగనగా కుంతల దేశం అనే రాజ్యానికి రుద్రసేనుడనే మహారాజు ఉండేవాడు. అతనికి ఒకే ఒక కుమార్తె ఉండేది. ఆమె అందాల భరిణ. ఆమె పేరు సౌందర్యవతి.
సౌందర్యవతి పేరుకు తగినట్టు ఎంత అందంగా ఉండేది, గుణవతి, అన్ని విద్యలు నేర్చింది. అన్ని విద్యల్లోనూ రాణించింది. తల్లిదండ్రుల ఆజ్ఞను జవదాటని యువరాణి.
రుద్రసేనుడికి ఒకే ఒక్క బాధ ఉండేది, అదేంటంటే తన కూతురు సౌందర్యవతి ఎప్పుడు నవ్వేది కాదు. ఆమె పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఎప్పుడూ నవ్వలేదు. ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. తండ్రి రుద్రసేనుడు సౌందర్యవతికి స్వయంవరం ప్రకటించాడు.
స్వయంమరానికి షరతు ఏమిటంటే ఎవరైతే సౌందర్యవతిని నవ్వించగలరో, వారికే తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని రుద్రసేనుడు స్వయంవరం ప్రకటించాడు.
రుద్రసేనుడి స్వయంవరం విని ఎందరెందరో రాజకుమారులు వచ్చి సౌందర్యవతిని నవ్వించడానికి ప్రయత్నించారు, కానీ అందరూ విఫలమవుతూనే ఉన్నారు.
అదే రాజ్యంలో విక్రముడనే యువకుడు ఉండేవాడు. విక్రముడు చాలా మంచి స్వభావం కలవాడు, ఎంతో తెలివైనవాడు. నలుగురికి సాయం చేస్తూ మంచిగా ఉండేవాడు. తాను చేసిన సహాయానికి తిరిగి పెద్దగా ప్రతిఫలం కూడా తీసుకునేవాడు కాదు, తన తిండికి తన కుటుంబ అవసరాలకి సరిపడా ధనము మాత్రమే తీసుకునేవాడు.
ఇదేమిటి విక్రమా ఇలా అయితే ఎలా ధసం సంపాదిస్తావు అని అడిగిన వాళ్ళకి ఎవరి చేసుకున్న పుణ్యం వాళ్లకే అని చెప్పేవాడు.
ఒకసారి విక్రముడికి కోటలో ఉద్యానవనంలో పని ఉందని ఎవరో చెప్పగా విని ఉద్యానవనానికి వెళ్ళాడు అక్కడ కోటలో ఉద్యానవనంలో పనిచేస్తుండగా తోటి పనివారికి సాయం చేస్తూ అందరినీ నవ్విస్తూ విక్రముడు పని చేసుకుంటూ వెళుతున్నాడు.
ఒకరోజు ఉద్యానవనంలో పనిచేస్తుండగా పిల్లవాని ఏడుపు వినిపించి విక్రముడు అటుగా వెళ్ళాడు కాసేపు విచిత్ర చేష్టలు చేసి ఆ పసిపిల్లవాడిని నవ్వించడానికి విక్రముడు ప్రయత్నించాడు. కొంతసేపటికి ఆ పిల్లవాడు ఏడుపాపాడు, అప్పుడు విక్రముడు తన జేబులో ఉంచి తోలుబొమ్మలు తీసి ఆడిస్తూ ఆడిస్తూ కథలు చెప్తూ ఆ పిల్లవాడిని నవ్వించాడు.
ఇదంతా దూరం నుంచి చూస్తున్న సౌందర్యవతి కూడా చివరికి నవ్వేసింది.
సౌందర్యవతి నవ్వింది అన్న విషయం తెలుసుకున్న రుద్రసేన మహారాజు వెంటనే ఆమెను నవ్వించిన వ్యక్తి ఎవరని వాకబు చేశాడు. అప్పుడు తన కుమార్తె సౌందర్యవతిని నవ్వించిన వ్యక్తి తన ఉద్యానవనంలో పనిచేయడానికి వచ్చిన విక్రముడని తెలుసుకొని అతనికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి, తన అల్లుడిని చేసుకొని రాజ్యాధికారం అప్పచెప్పి కుంతల దేశ రాజుని చేశాడు.
విక్రముడు చేసిన మంచి అతనికి ఎంతో అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇచ్చింది.
అందుకే అన్నారు పెద్దలు మంచి చేసిన వారికి మంచే జరుగుతుందని. మన తెలివితేటల్ని మంచికి ఉపయోగించాలి అని తెలుసుకోవాలి.
Grandma telugu stories will bring you more telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading telugu stories...🎉🎉☕☕✨😀