Burru Pitta Burru Pitta Turrumannadi Rhyme: Grandmas Telugu Rhymes
Burru Pitta Burru Pitta Turrumannadi Rhyme
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తురుమన్నది!
పడమటింట కాపురం చేయనన్నది !
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తురుమన్నది!
అత్త తెచ్చిన కొత్తకోక కట్టనన్నది!
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తురుమన్నది!
మామ తెచ్చిన మల్లెపూలు ముడువనన్నది!
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తురుమన్నది!
మొగుని చేతమొట్టికాయలు తింటానన్నది!
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తురుమన్నది!
కొత్త చుట్టం కోసం పాయసం చేయనన్నది!
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తురుమన్నది!
అమ్మ నాన్న మాట వింటానన్నది!
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తురుమన్నది!
తియ్య, తియ్యని లడ్డూలు చేసి అందరి నోట్లో పెడతానన్నది!
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తురుమన్నది!
Grandma telugu stories will bring you more telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading telugu stories...🎉🎉☕☕✨😀