Honesty Is The Best Policy: Telugu Learning Stories For Kids

Honesty Is The Best Policy: Telugu Learning Stories For Kids

ఎప్పుడూ అసత్యం అడరాదు


Telugu Stories


వివేక్, నైనా, బన్నీ, ముగ్గురు మంచి స్నేహితులు. వారు చదువులో ఎప్పుడూ ముందు ఉండేవారు. వారికి ఒకరోజు క్లాసులో వారి మిత్రులు మాట్లాడుతున్న కొత్త సినిమా చూడాలని అనిపించింది.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu prover

కానీ ఇంట్లో చెప్తే ఒప్పుకోరు, అందుకని వారు ఇంట్లో వారి తల్లి తండ్రులకి తెలియకుండా సినిమా చూసి రావాలని అనుకున్నారు.

దానితో అందరూ వారి తల్లి తండ్రులకి తెలియకుండా వెళ్ళటానికి ఒక మార్గం ఆలోచించారు.

అది ఏమిటంటే తరువాతి రోజు ఉదయం,రోజులాగే స్కూలుకి బయలుదేరి వచ్చి అందరూ వచ్చిన తర్వాత అందరూ కలసి వెనుక గేటులోంచి సినిమాకి వెళదామని అనుకున్నారు.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu prover

కొత్త సినిమాకి వెళ్తున్నామన్న అనందంలో అందరూ ఇంటికి వెళ్లిన తర్వాత ఏంతో ఉత్సాహంతో వారి ఇంటి పని పూర్తి చేసుకున్నారు.

బన్ని భోజనం చేసేటప్పుడు తర్వాత రోజు చూడబోయే సినిమా గురించి తలుచుకుంటూ ఆనందం పట్టలేక, తర్వాత రోజు వారు చూడబోయే సినిమా గురించి తన అమ్మ నాన్నతో చెప్పేశాడు.

కాని తను వారికి చెప్పిన విషయం తను అనందంలో మర్చిపోయాడు, అదే ఉత్సాహంతో వెళ్లి పడుకున్నాడు.


బన్ని తల్లితండ్రులు, విషయం విని ఆశ్చర్యపోయారు, కానీ బన్ని ముందు బయటపెట్టలేదు. వారు వివేక్, నయన తల్లితండ్రులకి ఫోన్ చేసి విషయం గురించి చెప్పి కూపి లాగమన్నారు.

అప్పుడు వారికి విషయం అర్థమయ్యింది, ముగ్గురూ కలసి తర్వాత రోజు సినిమాకి వెళ్లాలని అనుకున్నారు అని అర్థమయ్యింది.

అందరి తల్లి తండ్రులు ఒక నిర్ణయానికి వచ్చారు, అది ఏమిటంటే, వారు పిల్లల్ని దండించడలుచుకోలేదు, కానీ వారికి బుద్ధి వచ్చేటట్టు చేయలని అనుకున్నారు.


అందుకని వారు పిల్లల్ని సినిమాకి వెళ్ళనిచ్చారు. హాలులో పిల్లలకి వెనుక వరుసలో కూర్చున్నారు. సినిమా పూర్తి అయ్యేవరకు వేచిఉన్నారు, సినిమా పూర్తి అయ్యే సమయానికి వారు పెద్దగా శబ్దం చేస్తూ మాట్లాడుకున్నారు. ఎమిటా శబ్దం అని పిల్లలు వెనక్కు తిరిగి చూసేసరికి ఇంకేముంది, అక్కడ వారి తల్లి తండ్రులు వారి ముందు నిలుచుని ఉన్నారు.

ముగ్గురు పిల్లలు ఒక్కసారి ఏడుపు లంఘించుకున్నారు. ఇది చూసిన తల్లి తండ్రులు వారిని ఓదార్చి బయటికి తీసుకువెళ్లి, ఐస్ క్రీం కొనిచ్చి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయవద్దు అని చెప్పారు.
Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu prover

అప్పుడు వివేక్, నైనా, బన్నీ, ముగ్గరూ ముక్తకంఠంతో, మేము ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయమని చెప్పి, వారు తమ తప్పు తెలుసుకున్నారు అని చెప్పారు.

తర్వాత రోజు స్కూలులో వారు చేసిన తప్పు అందరికీ చెప్పి వారి తరగతిలో మిత్రులందరికీ చివరిగా ఒక విషయం చెప్పారు, అది ఏమిటంటే ఎప్పుడూ అసత్యం అడరాదు.
అందుకే అన్నారు పెద్దలు ఎప్పుడూ అసత్యం ఆడరాదని. అసత్యం అనేది ఎప్పుడు మనకి చేటు పరిణామాలని తెస్తుంది.


Grandma telugu stories will bring you more telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading telugu stories...🎉🎉☕☕✨😀



Grandma

I am a housewife with three kids they encouraged me to take blogging so that I can show my superpower ✨✨🎉🎉✨✨☕☕ of telling stories to all, sharing my cooking recipes..... many more interesting things....

Post a Comment

Previous Post Next Post